అన్ని రంగాల్లో మహిళల ముందంజ
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారని, పురుషులతో సమానంగా పోటీపడడం శుభపరిణామమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షత్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అఽథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో పొటీ పడాలన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సోలార్ శక్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమన్నారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సత్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సీడబ్ల్యూసీ కమిటీ ప్రతినిధులు హైమావతి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment