ప్రారంభమైన కొమ్మాల జాతర | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన కొమ్మాల జాతర

Published Sat, Mar 15 2025 1:35 AM | Last Updated on Sat, Mar 15 2025 1:35 AM

ప్రార

ప్రారంభమైన కొమ్మాల జాతర

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర హోలీ పండుగతో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యల్లో వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కొమ్మాల స్టేజీ నుంచి రాజకీయ పార్టీల ప్రభబండ్లు బయలుదేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, భక్తులు, అంబులెన్స్‌లలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. నిషేధం ఉన్నా కూడా జాతరలో డీజేల జోరు కొనసాగింది. కాంగ్రెస్‌ ప్రభను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పదేళ్లలో జాతర ఎంతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. అధికార పార్టీలోనే రెండు వర్గాలు కావడంతో జాతరలో ప్రశాంతత దెబ్బతిందన్నారు. బీజేపీ ప్రభను డాక్టర్‌ కాళీప్రసాద్‌ ప్రారంభించారు. కొండా వర్గం ప్రభను అల్లం బాలకిశోర్‌రెడ్డి, వీరగోని రాజ్‌కుమార్‌ ఏ ర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ప్రారంభించారు. కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నా యకులు వరద రాజేశ్వర్‌రావు, దొమ్మాటి సాంబయ్య, గన్నోజు శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, అధికార ప్రతినిధి కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ కడారి రాజుయాదవ్‌, రాంబాబు, శ్రీనివాస్‌, ములక ప్ర సాద్‌, ప్రవీణ్‌, పోలీస్‌ ధర్మారావు, బోడకుంట్ల ప్రకా శ్‌, జయపాల్‌రెడ్డి, రాజయ్య, నాగేశ్వర్‌రావు, భరత్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, ట్రెయినీ ఐపీఎస్‌ మనన్‌భట్‌, ఏసీపీ తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు.

లక్ష్మీనర్సింహస్వామికి భక్తుల పూజలు

కొమ్మాల స్టేజీ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

అట్టహాసంగా రాజకీయ ప్రభలు

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రారంభమైన కొమ్మాల జాతర1
1/3

ప్రారంభమైన కొమ్మాల జాతర

ప్రారంభమైన కొమ్మాల జాతర2
2/3

ప్రారంభమైన కొమ్మాల జాతర

ప్రారంభమైన కొమ్మాల జాతర3
3/3

ప్రారంభమైన కొమ్మాల జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement