ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి

Published Sun, Mar 16 2025 12:52 AM | Last Updated on Sun, Mar 16 2025 12:52 AM

ముసాయిదాను వెనక్కి  తీసుకోవాలి

ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి

కేయూ క్యాంపస్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 యూజీసీ ముసాయిదాను వెనక్కితీసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ జాతీయ నాయకులు పి.మహేశ్‌, పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్‌, కోశాధికారి పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్‌, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, పీడీఎస్‌యూ నాయకులు గణేశ్‌, పండు, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

కాజీపేట అర్బన్‌: హనుమకొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు మెటార్‌ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రాంరెడ్డి శనివారం తెలిపారు. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌ఎంవీ (హెవీ మోటర్‌ వెహికిల్‌), ఎల్‌ఎంవీ(లైట్‌ మోటర్‌ వెహికిల్‌) డ్రైవింగ్‌ శిక్షణను టజీఆర్టీసీ సౌజన్యంతో తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈనెల 31 లోపు హనుమకొండ కలెక్టరేట్‌లోని బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నేడు అటల్‌ జీ యాదిలో

ఆత్మీయ సమ్మేళనం

హన్మకొండ: మాజీ ప్రధాని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఈనెల 16న ‘అటల్‌ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హనుమకొండ హంటర్‌ రోడ్‌లోని డీ కన్వెన్షన్‌ మినీ హాల్‌లో ఈసమ్మేళనం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటల్‌ బీహారీ వాజ్‌పేయి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement