వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Published Tue, Mar 18 2025 10:08 PM | Last Updated on Tue, Mar 18 2025 10:02 PM

వరంగల

వరంగల్‌

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టెన్త్‌ విద్యార్థుల వివరాలు

వర్సిటీల అభివృద్ధికి నిధులు..

రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనకు కేంద్రం నిధులు కేటాయించాలని వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం నుంచి ఎండ తీవ్రత

ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీచే అవకాశం ఉంది.

8లోu

ఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్‌ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్‌ రైటింగ్‌ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్‌ అర్బన్‌

మొత్తం విద్యార్థులు

42,262

బాలికలు

20,600

బాలురు

21,662

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

పదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్‌ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్‌ చేస్తే తగిన సూచనలిస్తాం.

– పోగు అశోక్‌, తెలంగాణ సైకాలజిస్ట్‌

అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి

వివరాలు 8లోu

No comments yet. Be the first to comment!
Add a comment
వరంగల్‌1
1/3

వరంగల్‌

వరంగల్‌2
2/3

వరంగల్‌

వరంగల్‌3
3/3

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement