కంఠమహేశ్వరుడికి జలాభిషేకం
సంగెం: మండలంలోని లోహితలో కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం గౌడకులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వరస్వామికి ఇంటింటి నుంచి బిందెలతో నీటిని తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహించారు.
పర్వతగిరి మండలంలో..
పర్వతగిరి: పర్వతగిరి మండలం వడ్లకొండలో కంఠమహేశ్వరస్వామి, సూరమాంబదేవి కల్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా గుడి నిర్మించి ఐదు రోజులైన సందర్భంగా సోమవారం బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో తరలి వచ్చి కంఠమహేశ్వరస్వామి శ్రీసూరమాంబదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, పూజారి ఏరుకొండ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షుడు పట్టాపురం భిక్షపతిగౌడ్, కుల పెద్ద మనుషులు పట్టాపురం ఎల్ల్లాగౌడ్, మంగాపురం ప్రభాకర్, పట్టాపురం రాజు, రమేశ్, దేవేందర్, బాలే రాజు, రంగు కుమారస్వామి, సారంగం, మందాపురం భిక్షపతి, పట్టాపురం అశోక్, అనిల్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment