వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. గోవిందా అంటూ భక్తులు రథాన్ని గుట్టచుట్టూ తిప్పారు. తొలుత స్వామి వారు, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవిని గుట్టపైన ఉన్న ఆలయం నుంచి కిందికి తోడ్కొని వచ్చారు. విశ్వక్‌సేవ, పుణ్యాహవచనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించేందుకు కొంత సమయం గుట్ట దిగువన ఉత్సవమూర్తులను ఆసీనులను చేయించారు. అనంతరం విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై దేవతామూర్తులను కూర్చుండబెట్టి రథాన్ని లాగుతూ గుట్టచుట్టూ తిప్పారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి మొక్కులు సమర్పించారు. బుధవారం స్వామి వారిని విశ్వనాథపురానికి తోడ్కొని వెళ్లి పారువేట, చక్రతీర్థం, శ్రీపుష్పయాగం, నాగవెల్లి నిర్వస్తామని, ఆ తర్వాత దేవతామూర్తులను గుట్టపైకి తీసుకెళ్తామని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు పేర్కొన్నారు. ఽఅర్చకులు రామాచార్యులు, విష్ణు, ఫణి రథోత్సవంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కొమ్మాలలో మార్మోగిన
గోవిందనామస్మరణ
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment