చివరి ఆయకట్టుకు సాగు నీరందించండి
● అసెంబ్లీలో దండం పెట్టి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
కమలాపూర్ : నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, గూనిపర్తి, మాదన్నపేట, శనిగరం, లక్ష్మిపూర్, గోపాల్‌పూర్, బత్తినివానిపల్లి తదితర గ్రామాలకు సాగు నీరందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డీబీఎం–21, 22, 23, 24 ద్వారా వెంటనే సాగు నీరు అందించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.800 కోట్లు కేటాయించారని, అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment