పూర్తిస్థాయిలో కల్యాణ మండపం నిర్మించాలి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండప పనులు పూర్తి స్థాయిలో జరగాలని రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం ఉదయం జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నారాయణ దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఘనంగా స్వాగతించారు. వారు స్వామివారిని దర్శించి బిల్వార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. కేంద్ర పురావస్తుశాఖ ఆఽధీనంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఆలయ విశిష్టతను తెలి పేందుకు పూర్తి స్థాయిలో గైడ్‌ను నియమించాలన్నా రు. వారి వెంట జిల్లా కోర్టు సిబ్బంది ఉన్నారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల
ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య
Comments
Please login to add a commentAdd a comment