నిట్ డైరెక్టర్‌ను కలిసిన సీపీ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి మాట్లాడుతూ.. నిట్‌లో విద్యనభ్యసిస్తున్న దేశ, విదేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ, పోలీస్ శాఖ అందజేస్తున్న సేవలపై పరస్పరం చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, కాజీపేట ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, ఎస్సై లవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment