
గంగదేవిపల్లిని సందర్శించిన రాజస్థాన్ ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని 21 మంది సభ్యులతో కూడిన రాజస్థాన్ రాష్ట్ర ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. రాజస్థాన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ మురారీలాల్‌శర్మ, కన్సల్టెంట్ కోఆర్డినేటర్ పునీత్ మౌర్య ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు టీజీఐఆర్‌డీ సెంటర్ హెడ్ అనిల్‌కుమార్ పర్యవేక్షణలో గంగదేవిపల్లి సందర్శనకు వచ్చారు. జీపీడీపీ ప్లాన్ పనులు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం, ఫారం పాండ్లు, తీగజాతి తోటల పెంకాన్ని పరిశీలించారు. గ్రామస్తులను రాంరాం బాయి, బహెన్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ కేంద్రంలో జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి.. గ్రామ కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయాలు, పొందిన 19 జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధి గురించి ప్రధాని నరేంద్రమోదీ మూడుసార్లు ప్రస్తావించినట్లు ఆయన గుర్తుచేశారు. 20 ఏళ్ల క్రితం గ్రామంలో ట్విన్‌పిట్ టెక్నాలజీతో నిర్మించిన మరుగుదొడ్లు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వి.కృష్ణవేణి, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, ఏపీఎం చంద్రకాంత్, ట్రైనింగ్ మేనేజర్ కరుణాకర్, టీజీఐ ఆర్‌డీ ప్రతినిధి నిమ్మల శేఖర్, క్లస్టర్ టీఏలు సుధాకర్, సురేశ్, ఈసీ శ్రీలత, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment