
చారిత్రక గడిని కూల్చవద్దని ధర్నా
కమలాపూర్: చారిత్రక గడిని కూల్చివేయొద్దని కోరుతూ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలో కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక గడిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము కొనుగోలు చేశామనే నెపంతో కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చారిత్రక కట్టడాలను అమ్మడం, కొనడం అంటే ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని, తాతలకాలం నుంచి ఈ గడి గ్రామ దేవతలకు నిలయంగా ఉంటోందని, ఇక్కడినుంచే సమ్మక్క–సారలమ్మ జాతరకు, దసరా వేడుకలకు అంకురార్పణ జరుగుతుందన్నారు. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ గడిని కూలగొట్టకుండా భావితరాల కోసం అలాగే ఉంచాలని కోరారు. గడి కూల్చివేతను వ్యతిరేకిస్తూ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు శుక్రవారం గడిని పరిశీలించి అక్కడే నిరసన ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. ఆందోళనలో మాజీఎంపీటీసీ మాట్ల వెంకటేశ్వర్లు, కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు నాంపెల్లి మొగిలి, మంచాల రాజయ్య, అట్ల సమ్మయ్య, కిన్నెర కృష్ణమూర్తి, వెంగళ సహదేవ్, ఎండీ.దుర్వేశ్, రాముల అశోక్, సంపత్, సతీశ్, పిట్టల కృష్ణ, మాట్ల సాగర్, రాజు, శ్రీధర్, రమేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment