కలెక్టర్ రాక కోసం పడిగాపులు
హన్మకొండ అర్బన్: ఓవైపు అర్జీదారులు వినతులు ఇస్తారని అధికారులు.. మరోవైపు కలెక్టర్ ప్రావీణ్య వస్తే వినతులిద్దామని అర్జీదారులు పడిగాపులు కాశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వేచి చూశారు. కానీ వారికి వినతులు ఇచ్చేవారు లేకపోవడంతో అధికారులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మరోవైపు అదే హాల్‌లో వెనుకవైపు కూర్చు న్న వారంతా కలెక్టర్ ప్రావీణ్య వస్తే వినతులు ఇద్దామని వేచి చూశారు. కానీ.. అత్యవసర పనుల కారణంగా, లెప్రసీ డే కార్యక్రమాల వల్ల ఈవారం కలెక్టర్ ప్రజావాణికి రాలేదు. చివరికి అధికారులు వెళ్లే సమయంలో అంతా వచ్చి తమ వినతులు ఇచ్చి రసీదు తీసుకుని వెళ్లారు.
కలెక్టర్ రాక కోసం పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment