బస్టాండ్ ప్రదేశంలో బాంబుల పేల్చివేత
వరంగల్: వరంగల్ బస్డాండ్ స్థానంలో ప్రభుత్వం నూతనంగా మోడల్ బస్టాండ్ నిర్మిస్తోంది. పనుల్లో భాగంగా పిల్లర్లు ని ర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు ఉండడంతో తొలగించడం అనివార్యమైంది. ఈ రాళ్లను తొలగించేందుకు కాంట్రాక్టర్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ (బాంబులు)పెట్టి పేల్చివేసినట్లు తెలిసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమీపంలోని తాత్కాలిక బస్టాండ్‌లో నిలిచి ఉన్న భూపాలపల్లి డిపోకు చెందిన బస్సులో పెద్ద బండరాయి పడింది. ఈ రాయి తాకడంతో బస్సు కిటికీల అద్దాలు పగిలి డ్రైవర్, కండక్టర్లకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. బండరాయిని తొలగించేందుకు కాంట్రాక్టర్ అధికా రుల నుంచి అనుమతులు తీసుకున్నారా.. లేదా అన్న విషయం తెలియరాలేదు. అయినప్ప టికీ మిట్ట మధ్యాహ్నం బాంబు పేల్చడంపై పలు వురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద బండరాయి బస్సులో కాకుండా అక్కడే ఉన్నవారి పై పడితే మృత్యువాత పడేవారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలు కాంట్రాక్టర్ జిలెటిన్‌స్టిక్స్ పెట్టారా ...బాంబులు పెట్టారా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఈ ఘటనలో బస్సు ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్ రూ.10వేలు పరిహారంగా ఇచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఈవిషయంపై ఇంతేజార్‌గంజ్ పోలీసులను వివరణకోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
నాడు నేడు నిర్లక్ష్యమే...
బస్టాండ్‌లో జరుగుతున్న ప్రతి పనిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడాదిన్నర క్రితం పాత బస్టాండ్‌లోని వాటర్ ట్యాంక్‌ను కూల్చివేసిన సమయంలో భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ఓ కూలీ మృత్యువాత పడ్డారు. ఇప్పుడు బాంబుల పేల్చివేతతో బండరాయి బస్సులో పడింది. దీతో కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నా రు. ఇదేవిషయంపై ఆర్టీసీ, పోలీసు అధికారుల వి వరణ కోసం సాక్షి ప్రయత్నించగా స్పందించలేదు.
బస్సులో పడిన బండరాయి
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు?
Comments
Please login to add a commentAdd a comment