కొమ్మాల ఆదాయం రూ. 49.11 లక్షలు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర ఆదాయం ఈ ఏడాది రూ.49,11,096 వచ్చిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. హుండీల్లోని కానుకలను మంగళవారం ఆలయం వద్ద లెక్కించిన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 25వ తేదీ వరకు ఈ ఆదాయం సమకూరిందన్నారు. గత ఏడాది జాతర సందర్భంగా 31 రోజుల్లో రూ.27.45 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ ఏడాది హుండీల ద్వారా రూ. 20.48 లక్షలు ఆదాయం రాగా.. గత ఏడాది రూ.7.24 లక్షలు వచ్చిందన్నారు. వేలం, వివిధ రకాల టికెట్ల ద్వారా ఈ ఏడాది రూ.28.62 లక్షలు సమకూరితే గత ఏడాది రూ.20.20 లక్షలు సమకూరిందని వివరించారు. అధికారులు, అర్చకులు, సిబ్బంది సహకారంతో జాతర విజయవంతమైందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి పరిశీలకుడిగా అనిల్‌కుమార్, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తు ల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు కడారి రాజు బృందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు కానుకలను లెక్కించారు.
గత జాతరతో పోలిస్తే
రూ. 21.66 లక్షల అధిక ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment