పీఎన్‌డీటీ చట్టం ఉల్లంఘిస్తే చర్యలు
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ (పీసీ అండ్ పీఎన్‌డీటీ) చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన పీసీఅండ్ పీఎన్‌డీటీ అథారిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఆస్పత్రిలో చట్టా నికి సంబంధించిన బోర్డు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు. వైద్యాధికారులు రిజిస్టర్ అయిన కేంద్రాలతోపాటు రిజిస్టర్ కాని ఆస్పత్రులను కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పబ్లిక్ స్థలాల్లో వాల్‌పోస్టర్లు ప్రదర్శించడంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎన్‌హెచ్‌జీ గ్రూపులను కూడా అవగాహన సదస్సుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లోని మహిళలకు అవగాహన కల్పించడమే కాక గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఆర్‌డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment