ఐనవోలులో అర్చకులు, సిబ్బంది రాస్తారోకో
ఐనవోలు: టెండరుదారుపై చర్యలు తీసుకోవాలని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అర్చకులు, సిబ్బంది, స్వీపర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయం బయట రాస్తారోకో నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయంలో కొబ్బరి ముక్కలు సేకరించేందుకు టెండర్ పొందిన గుండెబోయిన లావణ్య ఇటీవల కొంతమంది భక్తులను దుర్భాషలాడుతూ భౌతికంగా దాడి చేసింది. నాకు నోటీసులు ఇచ్చింది నువ్వేనా అంటూ సోమవారం సాయంత్రం ఆలయ కంప్యూటర్ ఆపరేటర్ తీగల రాజును దుర్భాషలాడి భౌతిక దాడి చేసింది. దీంతో అర్చకులు, సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ హామీతో రాస్తారోకో విరమించారు. లావణ్య టెండర్ రద్దు చేయాలని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావుకు అర్చకులు, సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా లావణ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అర్చకులు నరేశ్‌శర్మ, మధుకర్‌శర్మ, మధుశర్మ, దేవేందర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment