
‘ఈనాడు’ ప్రతుల దహనం.. నిరసనలు
సాక్షి, భీమవరం/కాళ్ల(పశ్చిమగోదావరి జిల్లా): అసత్య కథనాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే లక్ష్యంతో ఈనాడు పత్రిక సమాజంలో తన ఉనికిని కోల్పోయిందని భీమవరం ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గానాగమల్లేశ్వరరావు (బాబు), వైఎస్సార్‌సీపీ నాయకులు తోట భోగయ్య, గూడూరి ఉమాబాల మండిపడ్డారు.
ఈనాడు పత్రిక తప్పుడు రాతలను నిరసిస్తూ శుక్రవారం భీమవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై బురదజల్లడానికి ఈనాడు చేసిన కుట్ర బహిర్గతమైందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘పచ్చ’ రాతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పార్టీ నాయకులు కోడే విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, మానేపల్లి నాగన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
విలువలను దిగజార్చుతూ..
కాళ్ల: ఈనాడు అధినేత రామోజీరావు పాత చిత్రాలను కొత్తవిగా చూపించే ప్రయత్నంలో జర్నలిజం విలువలను దిగజార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు ఆదేశాల మేరకు ఆయన సోదరుడు పెనుమత్స గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. నాయకులు పెనుమత్స గోపాలకృష్ణరాజు, జెడ్పీటీసీలు సోమేశ్వరరావు, రణస్తుల మహంకాళి మాట్లాడుతూ చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను పెన్నుల్లో నింపేసుకుని రామోజీరావు రాష్ట్రంపై, సీఎం జగన్‌పై తప్పుడు వార్తలు, కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరిరాజు, కాళ్ల, ఉండి మండల పార్టీ కన్వీనర్లు రాంబాబు పెనుమత్స ఆంజనేయరాజు కోపల్లె, కలవపూడి, ఉండి సొసైటీల చైర్మన్లు వేగేశ్న జయ రామకృష్ణంరాజు, పెనుమత్స ప్రసాద్‌రాజు, పేరిచర్ల సూర్యనారాయణ రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment