
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి
పాలకొల్లు అర్బన్: అపరిష్కృతంగా ఉన్న ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు డిమాండ్ చేశారు. పాలకొల్లు మండలం చందపర్రులో త్రిబుల్ ఎస్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కె.అచ్చెన్నాయుడు, అప్సడా చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేయాలని తీర్మానించారు. హేచరీ కంపెనీలు నాణ్యమైన సీడు అందించాలని, రొయ్యల మేత తయారీ కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ తగ్గించడం లేదని ఆయన మండిపడ్డారు. ఎంఫెడా, ఫిషరీస్ అధికారులు ఆక్వా రైతులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతు సంఘాలన్నింటినీ సమీకరించి మహా ధర్నా చేపట్టనున్నట్లు గాంధీ భగవాన్‌రాజు వెల్లడించారు. సమావేశంలో ఆక్వా రైతు సంఘ నాయకులు బోనం వెంకట నరసయ్య (చినబాబు), మేడిది జాన్ డేవిడ్‌రాజు, కోడి విజయభాస్కర్, అంగర వరప్రసాద్, యువరాజ్, గుంటూరు వెంకట సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment