సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి
భీమవరం: రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. బుధవారం భీమవరం పట్టణం ఆనంద ఇన్‌లోఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పూలసాగు–ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు, రైతులకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మకాన్ సాగుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పెనుగొండ, సిద్ధాంతం ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని, జిల్లాలో పువ్వుల సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులను అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు పంట మార్పిడి చేయాలన్నారు. పాలీహౌస్ నిర్మాణానికయ్యే ఖర్చులో 50 శాతం రాయితీగా గరిష్టంగా ఎకరానికి రూ.16 లక్షల రాయితీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో కేవీకే హెడ్ డాక్టర్ మల్లికార్జున్, డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరికల్చర్ డాక్టర్ డీవీఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలన
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య బృంద సభ్యులు డాక్టర్ నీరదా, డాక్టర్ సందీప్ భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని టీబీ విఽభాగం, ఆస్పత్రిలోని ల్యాబ్‌లు, వార్డులు తదితర వాటిని పరిశీలించారు. టీబీకి సంబంధించి ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగహన కల్పించారు.
నేడు ఉద్యాన వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ కే.గోపాల్ బుధవారం వివరాలు వెల్లడిస్తూ.. వివిధ దేశాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఉద్యాన పంటలు, దేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయడానికి అనుకూల అంశాల గురించి ఈ సదస్సులో అధ్యయనం చేస్తారన్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలతో చర్చించి, ఉద్యాన, వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో సాగుచేయడానికి వీలుగా తగిన పద్ధతులు రూపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. వియత్నాం, శ్రీలంక, అమెరికా తదితర దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఆన్‌లైన్ విధానంలో పాల్గొంటారన్నారు. బెంగళూరు జాతీయ ఉద్యాన పరిశోధనా సంస్ధ శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొంటారన్నారు. అమెరికాలోని అబర్న్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రఖ్యాత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎస్.రెడ్డి ముఖ్య సందేశం ఇస్తారన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
భీమవరం: జిల్లాలోని 52 పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 15,296 మందికి 14,831 మంది విద్యార్థులు హాజరుకాగా, ఒకేషనల్ పరీక్షకు 1,543 మంది విద్యార్థులకు 1,442 మంది హాజరయ్యారని డీఐఈవో ఎ నాగేశ్వరరావు తెలిపారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుకాలేదు.
నిధుల దుర్వినియోగం కేసులో ఇద్దరి అరెస్టు
భీమవరం: భీమవరం మండలం చినఅమిరం, రాయలం గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం కేసుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్ పోలీసులు తెలిపారు. రెండు పంచాయతీల్లో గతంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన సాగిరాజు కిషోర్‌కుమార్‌రాజు, దున్న జయరాజు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు జిల్లా ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు విచారణ చేసి కిషోర్‌కుమార్‌రాజు, జయరాజును బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి
Comments
Please login to add a commentAdd a comment