ఆంధ్రా సుగర్స్‌లో భద్రతా నియమాలు భేష్
తణుకు అర్బన్: ప్రభుత్వం నిర్ధేశించిన సున్నా ప్రమాదాల లక్ష్యాన్ని సాధించాలంటే కార్మికులంతా విధిగా భద్రతా నియమాలను పాటించాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెంకటరాయపురంలోని ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థలో బుధవారం నిర్వహించిన 54వ జాతీయ భద్రతా వారోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిబంధనలను పాటిస్తూ గతేడాదిలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకున్న ఆంధ్రా సుగర్స్ యాజమాన్యాన్ని అభినందించారు. వారోత్సవాల్లో భాగంగా శ్రీతిమ్మరాజు స్కూల్స్, శ్రీముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి.రామకృష్ణ, పరిశ్రమ భద్రతా అధికారి ఎంఎస్‌వీవీ రామకృష్ణ, జనరల్ మేనేజరు (హెచ్‌ఆర్) ఎ.సాంబశివరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment