రైల్వే జీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ బుధవారం విజయవాడ డివిజన్‌లోని కాకినాడ–సామర్లకోట–రాజమండ్రి–నిడదవోలు–ఏలూరు సెక్షన్‌లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్, ఇతర అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు జీఎంను కలుసుకుని తమ ప్రాంతాలకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై వినతిపత్రాలు అందజేశారు. చివరిగా ఏలూరు స్టేషన్‌ను సందర్శించి అక్కడ ప్రయాణికుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి
జంగారెడ్డిగూడెం: ప్రమాదశాత్తు చీరకు నిప్పంటుకున్న వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాలివి. పట్టణంలోని గరుఢపక్షి నగర్‌కు చెందిన భోగిరెడ్డి సుబ్బాయమ్మ (88) ఒంటరిగా నివిస్తోంది. బుధవారం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకోవడంతో కాలిన గాయాలయ్యాయి. వృద్ధురాలు సుబ్బాయమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి మనుమడు భోగిరెడ్డి సతీష్‌కుమార్‌కు తెలిపారు. వెంటనే వృద్ధురాలిని అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఆసుపత్రి సమాచారం, మనుమడు సతీష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment