చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్
చాట్రాయి: చాట్రాయి తహసీల్దార్ డి ప్రశాంతిపై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్‌రాజు విచారణలో అవినీతి ఆరోపణలు, భూముల అక్రమ ఆన్‌లైలో భాగంగా తహసీల్దార్‌కు రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆమైపె అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో జిల్లా అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
పంచారామక్షేత్రం హుండీల ఆదాయం రూ.12.65 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం శ్రీఉమాసోమేశ్వర జనార్దనస్వామి వారి దేవస్థానం హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గత 93 రోజుల కాలంలో భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.12,65,994 లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.కృష్ణంరాజు తెలిపారు. అలాగే అన్నదానం నిమిత్తం రూ.23,337 విరాళం అందినట్లు చెప్పారు. ఈవో కె.శ్రీనివాసరావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment