వంచనపై గర్జన
వైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’ విజయవంతం
సాక్షి, భీమవరం/భీమవరం: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదల చదువుకు ప్రోత్సాహం అందిస్తామని చేసిన వాగ్దానాలను విస్మరించి దగాకోరు పాలన సాగిస్తున్న కూటమి సర్కారుపై ప్రజలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. కూటమి పాలనలో దగాపడిన నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన ‘యువత పోరు’కు అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఉండి, భీమవరం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు జిల్లా కేంద్రమైన భీమవరం తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నేతృత్వంలో పట్టణంలోని విస్సాకోడేరు వంతెన నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మెగా డీఎస్సీ నిర్వహించాలని, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తల్లికి వందన, విద్యా, వసతి దీవెన ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల తదితరులు ప్రసంగించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మొగలి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి, పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిలు పీవీఎల్ నర్సింహరాజు, గూడాల శ్రీహరిగోపాలరావు(గోపి), నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, పార్టీ జిల్లా అధికారప్రతినిధి కామన నాగేశ్వరరావు, మాలమాహానాడు జాతీయ అధ్యక్షుడు చీకలిమిల్లి మంగరాజు, సోషల్‌మీడియా జిల్లా కన్వీనర్ బంధన పూర్ణచంద్రరావు, జిల్లా యువత అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పార్టీ నేతలు చినమిల్లి వెంకట్రాయుడు, పెండ్ర వీరన్న, చెల్లెం ఆనందప్రకాష్, గుణ్ణం నాగబాబు, మద్దా చంద్రకళ, కర్రా జయచరిత, చెరుకూరి కుమారదత్తాత్రేయవర్మ తదితరులు పాల్గొన్నారు.
●
ప్రజల పక్షాన పోరుబాట
ఆరు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు రైతులు, మహిళలు, విద్యార్థులను రోడ్డు మీద నిలబెట్టారు. రైతులు, విద్యుత్ చార్జీల పెంపుతో నష్టపోతున్న వినియోగదారుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేసింది. ఇప్పుడు నిరుద్యోగ యువత, విద్యార్థులకు అండగా నిలబడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా దీవెనకు ఒక్క రూపాయి జమ చేయలేదు. అమ్మ ఒడిని పూర్తిగా ఆపేశారు. మా ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసి ఐదింటిని ప్రారంభించాం. మిగిలిన వాటి పనులు ముందుకు సాగకుండా కూటమి ఆపేసింది. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగభృతి అందించేందుకు చర్యలు చేపట్టాలి.
– ముదునూరి ప్రసాదరాజు, జిల్లా అధ్యక్షుడు
విద్యార్థులను రోడ్డున పడేశారు
కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో పేద విద్యార్థుల చదువులను రోడ్డు మీదకు తెచ్చింది. కళాశాలలకు ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మధ్యలో ఆపేసి మట్టి పనులకు వెళ్లాల్సిన దుస్థితి. వైఎస్సార్‌సీపీ తెచ్చిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను కూటమి అసంపూర్తిగా ఆపేసింది. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
– కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి
తల్లికి వందనమని వంచించారు
తల్లికి వందనం ఇస్తామని చెప్పి వంచించారు. గత బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు చూపించి చివరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏ గ్రామం వెళ్లినా యువత కూటమి ప్రభుత్వం మమ్మల్ని వెన్నుపోటు పొడిచి, నట్టేట ముంచారని ఆవేదన చెందుతున్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని లేఖరాసిన ఏకై క సీఎం చంద్రబాఋ. ఇప్పటికై నా కళ్లు తెరిచి పేద విద్యార్థులు, యువతకు న్యాయం చేయాలి.
– కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి
హామీలను గాలికొదిలేశారు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. తండ్రిని మించి తనయుడిగా మాజీ సీఎం జగనన్న నాడు–నేడు, విద్యా, వసతి, విదేశీ విద్యా దీవెనలతో పేదల ఉన్నతికి ఎంతో తోడ్పాటును అందించారు. అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులని వారి చక్కటి భవిష్యత్‌కు మాజీ సీఎం జగనన్ బాటలు వేశారు.
– గూడూరి ఉమాబాల, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి
కదంతొక్కిన పార్టీ శ్రేణులు
భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
వంచనపై గర్జన
Comments
Please login to add a commentAdd a comment