
కోర్టు స్టేపై సంబరాలు
తణుకు అర్బన్: తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న పశువధ కార్యకలాపాలపై హైకోర్టు స్టే విధించడంతో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. కారుమూరితోపాటు పార్టీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచారు. తేతలి గ్రామ మహిళలతోపాటు, గోసేవా సమితి, మాజీమంత్రి కారుమూరి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా నిలబడి చేసిన ఉద్యమం వృథా కాలేదు. తేతలి పశువధ శాల ముందు నిరసన శిబిరం ఏర్పాటుచేయడమే కాకుండా తేతలి గ్రామ దేవత గోగులమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేసుకుని పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు తమకు కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యానికి సహకరించి పోలీసుల కాపలాతో పశువధ నిర్వహించినా గోగులమ్మ తల్లి కృపతో న్యాయస్థానం తమ గోడు విందని తేతలి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment