ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వ హించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై జేసీ పి.ధాత్రిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి.విశ్వేశ్వరరావుతో కలిసి ఆమె సమీక్షించారు. ఈనెల 27న పోలింగ్ రోజు అనుసరించాల్సిన విధానం, వెబ్ కాస్టింగ్, బ్యాలెట్ బాక్సుల తరలింపు, రిసెప్షన్ సెంటర్లు, రూట్ అధికారులు, పోలీస్ బందోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఎంసీసీ, ఎంసీఎంసీ, పోస్టల్ బ్యాలెట్లు వంటి అంశాలపై చర్చించారు. ఆరు జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా మన్నారు. ఈనెల 26న ఉదయం నుంచి పోలింగ్ సామగ్రి సరఫరా ప్రారంభమవుతుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రులకు సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేపట్టాలన్నారు. రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఈనెల 22న నిర్వహించాలని ఆదేశించారు. మార్చి 3న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment