
ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వరుస ఆత్మహత్యలు
ఏలూరు టౌన్ : కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. ఒక్క ఏలూరు నగరంలో ఇటీవల ఆర్థిక సమస్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందో ళనకు గురిచేస్తోంది. ఒకవైపు ఉపాధి కరువై కుటుంబ జీవనం ఇబ్బందిగా మారటం... మరోవైపు చిరు వ్యాపారాలు నడవని దుస్థితిలో తీవ్ర మానసిక వేదనతో బలవంతంగా తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతం : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం జనం ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారు. ఏలూరులో ఇటీవల కాల్‌మనీ కేసులు సైతం నమోదు కాగా... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనం ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కనీసం ఉపాధి లేకపోవటం, ఉద్యోగాల కల్పన కానరాక, చిరు వ్యాపారాలు సైతం సాఫీగా సాగే పరిస్థితులు లేని దైన్యస్థితి.. గతంలో ఏలూరు నగరంలో సుమారు 78 వేల కుటుంబాలు ఉంటే ఏటా సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం ప్రజల జీవనానికి భరోసా కల్పించింది. కూటమి సర్కారు హయాంలో 9 నెలలు కావస్తున్నా కనీసం ఎన్నికల హామీలను అమలు చేయకపోవటం, సంక్షేమ పథకాలు రూపంలో ప్రజలకు అండగా ఉండాల్సి ప్రభుత్వం చేతులెత్తేయటంతో జనం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు.
అమలుకాని హామీలు కూటమి పాలనలో అష్టకష్టాల్లో ప్రజలు
కౌన్సెలింగ్ ఇవ్వాలి
ఏదైనా సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. కుటుంబ సభ్యులు వారి ప్రవర్తనను గమనిస్తూ వారిని మానసిక వైద్య నిపుణులు వద్దకు తీసుకువెళ్ళి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా వారితో ప్రేమగా మాట్లాడుతూ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భావోద్వేగాలను నియంత్రించుకునేలా వారి ఆలో చనల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఏలూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా మానసిక వైద్య విభాగం ఉంది. కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపేలా కుటుంబం సహకరించాలి.
– డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, మానసిక వైద్య విభాగం హెచ్‌వోడీ, ఏలూరు జీజీహెచ్

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వరుస ఆత్మహత్యలు

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వరుస ఆత్మహత్యలు
Comments
Please login to add a commentAdd a comment