ఎన్నికల కోడ్ అమలు ఇంకెప్పుడు?
పాలకొల్లు అర్బన్: ఎన్నికల నియమావళిని అధికారులు పాటించడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. దీనికి సంబంధించి కోడ్ అమలులో ఉంది. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు కోడ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలకొల్లు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలకు తొలగించడానికి వేయడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మొక్కుబడిగా కొన్నింటిని తొలగించి మిగిలిన వాటిని వదిలేశారు. పాలకొల్లు మండలం బల్లిపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు ఫ్లెక్సీ, అలాగే దగ్గులూరులో గవరపేట వెళ్లేరోడ్డులో విద్యుత్ స్తంభానికి మంత్రి రామానాయుడు ఫ్లెక్సీకి ముసుగులు వేయలేదు. ప్రతిరోజూ అధికారులు అటు వైపుగా ప్రయాణిస్తున్నారు. అయితే వారికి ఈ ఫ్లెక్సీలు కనిపించకపోవడం విశేషం మంత్రి రామానాయుడు ఫ్లెక్సీలు తొలగించడానికి అధికారులు భయపడుతున్నారంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమలు ఇంకెప్పుడు?
Comments
Please login to add a commentAdd a comment