ఏలూరు టౌన్: దెందులూరు ప్రాంతంలో ఒక వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం దెందులూరు రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్ధలానికి వెళ్ళి పరిశీలించారు. మృతుడు గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన చల్లంచర్ల మారయ్య (42)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బంధువులకు సమాచారం అందించామని రైల్వే ఎస్సై సైమన్ తెలిపారు.
11 మంది జూదరుల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు త్రీటౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోట్ల పోలీసులు పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేశారు. దొండపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి పేకాట నిర్వహిస్తున్నారని సమాచారంతో త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి చాటపర్రు ప్రాంతంలో రూరల్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.2,350 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment