మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ ఆర్‌ఎస్ రాజు సూచించారు. పోలవరం మండలం పట్టిసం రేవులో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాలినడకన వెళ్లే మార్గంలో పంట్లు, ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించి, ఫెర్రీ కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ఇసుక తిన్నెలపై జరిగే ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. దేవస్థానం వద్ద చేస్తున్న ఏర్పాట్లపై ఈవో చాగంటి సురేష్ నాయుడిని నుంచి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment