మద్దిలో వసతి గదులకు రూ.10 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం : మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద నిర్మిస్తున్న వసతి గదుల కోసం హైదరాబాద్ కు చెందిన మహేందర్, లత దంపతులు రూ.10,00,000 విరాళంగా ఇచ్చారని ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
తణుకు అర్బన్ : ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంకు సూర్యనారాయణ ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం ఆర్.మోహన్‌బాబు తెలిపారు. గత నెలలో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో సూర్య నారాయణ 1500 మీటర్ల రన్నింగ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. ఈ నెల 19 నుంచి 21 వరకు చండీగఢ్‌లో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు.
కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య
దెందులూరు: కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని దెందులూరు పోలీసులు తెలిపారు. ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన శెనగల వెంకటేశ్వరరావు (32) కొంతకాలం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 10న పురుగుమందు వాసన రావడంతో భార్యం ఏం జరిగిందని అడిగింది. కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగానని చెప్పడంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు ఏలూరు నుంచి విజయవాడ వైద్యశాలకు తీసుకెళ్లారు. విజయవాడలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
మద్దిలో వసతి గదులకు రూ.10 లక్షల విరాళం
Comments
Please login to add a commentAdd a comment