టెక్నాలజీని వినియోగించుకోవాలి
భీమవరం: ప్రపంచంలో కొన్ని దేశాలలో అపారమైన సహజ వనరులున్నప్పటికీ టెక్నాలజీ లేకపోవడంతో సహజ సంపద ఇతర దేశాలకు అందించి తిరిగి వారి వద్దే ఉత్పత్తులు కొనుగోలు చేసుకుంటున్నారని చైన్నెకి చెందిన ఇండియన్ పేటెంట్ డిప్యూటీ కంట్రోల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ ఎం.రాం జవహర్ అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 24 గంటల పాటు నిర్వీరామంగా నిర్వహించిన హ్యకథాన్ పోటీల్లో విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. మనకు లభ్యమవుతున్న సహజ సంపద పూర్తిస్థాయిలో వినియోగించుకుని దేశం ప్రగతి సాధించాలంటే టెక్నాలజీ ఎంతో అవసరమన్నారు. కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ఐడియా ల్యాబ్ టెక్నాలజీ సెంటర్లు తమ కళాశాలలో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తోట రవిచంద్ర మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతికి కెనరా బ్యాంక్ తమ వంతు సహకారం అందజేస్తుందన్నారు. ఈ పోటీల్లో అమరావతి వీఐటీ యూనివర్సిటీ కంప్యూటర్ సైనన్స్ ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుచుకోగా రూ. 12 వేలు నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానం తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలకు, తృతీయ స్థానం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నిలిచారు. ఐటీ డిపార్ట్‌మెంట్ హెడ్ పి రవికిరణ్‌వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ కె.నాగఆదిత్యవర్మ, బ్రెయిన్ నో విజన్ టీం ఐటీ విభాగం ప్రొఫెసర్ ఐ.హేమలత, కె.కిషోర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment