ఏలూరు (టూటౌన్): మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పా, మసాజ్ సెంటర్లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరక శ్యామల, మన్నవ యామిని శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక స్ఫూర్తిభవన్‌లో వారు మాట్లాడుతూ కొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. మధ్యతరగతి, పేద మహిళలను టార్గెట్ చేసిఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, స్పా సెంటర్లలో చేర్పిస్తున్నారన్నారు. అనంతరం మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దందా దేశంలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. పోలీసు శాఖ స్పా, మసాజ్ సెంటర్‌లపై దృష్టి సారించి నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment