శానిటేషన్ లేకనే వైరస్ వ్యాప్తి
తణుకు అర్బన్: కోళ్ల ఫారాల్లో రైతులు పూర్తిస్థాయి శానిటైజేషన్ పాటించకపోవడంతోనే వైరస్‌లు వ్యాప్తిస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ అన్నారు. తణుకు మండలం వేల్పూరు రెడ్‌జోన్‌లోని కోళ్ల ఫారాలను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. బాదంపూడి, వేల్పూరుల్లో కోళ్లకు వ్యాపించిన వైరస్ గతంలోనూ వచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కల్లింగ్ ప్రక్రియ పూర్తయిందని, శానిటైజేషన్ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. దీనివల్ల మానవాళికి ఎటువంటి ఇబ్బందులూ లేవని, అపోహలను నమ్మవద్దని తెలిపారు. కోళ్ల ఫారాల్లో తీసుకోవా ల్సిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో పాటించడం లేదని, ముఖ్యంగా ఫారాల్లో శానిటైజేషన్ సక్రమంగా లేకపోవడమే వైరస్‌లకు ప్రధాన కారణమని చెప్పా రు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి శానిటైజేషన్ చేసేలా కోళ్ల ఫారాల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేస్తామన్నారు. కోళ్ల ఫారాల వద్ద పనులు పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు ఫారాలను సీజ్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఫారం వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో కోళ్ల మరణాలు, తీసుకున్న జాగ్రత్తలు వంటి ఫొటోలను ఆయన పరిశీలించారు. వైరస్ సోకిన కృష్ణానందం పౌల్ట్రీస్‌లో నిర్వహిస్తున్న శానిటైజేషన్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ, తహసీల్దార్ దండు అశోక్‌వర్మ, మండల పశువైద్యాధికారి శంకర్ భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బాదంపూడిలో 30 వేల కోళ్ల ఖననం
ఉంగుటూరు: బాదంపూడిలోని వెంకట మణికంఠ ఫారంలో బర్డ్‌ఫ్లూ సోకిన 30 వేల కోళ్లను శనివారం ఖననం చేశారు. ఈ ప్రక్రియను పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర డైరెక్టర్ దామోదరనాయుడు పరిశీలించారు. జిల్లాకు చెందిన పశువైద్యులు, సహాయకులు సుమారు 100 మంది జేడీ టి.గోవిందరాజు పర్యవేక్షణలో కోళ్ల ఖననం చేశారు. ఈ ఫారం సమీపంలోని మరో ఫారంలోనూ కోళ్ల ఖననం ప్రక్రియ కొనసాగింది. మండలంలో చెక్‌పోస్టులు, మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ మనోజ్ పర్యవేక్షిస్తున్నారు.
ఊటాడలో 1,500 కోళ్లు మృతి
యలమంచిలి: మండలంలోని ఊటాడ గ్రామంలో నెక్కంటి సతీష్‌కుమార్ అనే కోళ్ల రైతు ఫారంలో ఉదయం 1,500 బ్రాయిలర్ కోళ్లు మృతిచెందాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి విజయవాడ, భోపాల్ పరీక్షా కేంద్రాలకు పంపించారు. అనంతరం పొక్లెయిన్‌తో కోళ్లను గొయ్యిలో ఖననం చేశారు. పశుసంవర్ధక శాఖ భీమవరం ప్రాంతీయ ఉప సంచాలకుడు జవార్ హుస్సేన్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే మేడపాడులో కూడా ఇలానే 5,500 కోళ్లు చనిపోయాయని తెలిపారు. దీంతో ఈ రెండు గ్రామాల పరిధిలో కిలోమీటర్ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించామన్నారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత ఇతర చర్యలు తీసుకుంటామన్నారు. పాలకొల్లు ప్రాంతీయ సహాయ సంచాలకుడు డాక్టర్ గంజనబోయిన మల్లేశ్వరరావు, మండల పశు వైద్యాధికారి పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.
పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్
శానిటేషన్ లేకనే వైరస్ వ్యాప్తి
శానిటేషన్ లేకనే వైరస్ వ్యాప్తి
Comments
Please login to add a commentAdd a comment