జనన, మరణాల నమోదు తప్పనిసరి
ఏలూరు (టూటౌన్): జనన, మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బుల్లికృష్ణ సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జనన, మరణాల నమోదు, కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల జారీ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ధ్రు వీకరణపత్రాల జారీకి సంబంధించి సూచనలు, నిబంధనలను ప్రతి కార్యాలయం వద్ద అధికారులు బహిర్గతం చేయాలన్నారు. పంచా యతీ, సచివాలయాల పరిధిలో ప్రజలకు అ వగాహన కల్పించాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంబరీష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శేషగిరి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్‌వీ మునేశ్వరరావు, ప్యానల్ లాయర్ కూనా కృష్ణారావు పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్‌కు అవకాశం కల్పించినట్టు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరుగనుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫాం–12ను ఈనెల 20న సాయంత్రం 5 గంటలోపు సమర్పించాలన్నారు. ఫాం–12ను ఏలూరు డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఫాం–12తో పాటు డ్యూటీ కేటాయింపు ఉత్తర్వులు జతచేయాలని కోరారు.
సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): అధికారులు సమన్వయంతో లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభలు, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు, నిరుపేదల ఇళ్ల స్థలాల పరిశీలన, 22–ఏ కేసులు, ఏపీ సేవా సర్వీ సులు, కోర్టు కేసులు, పైలెట్ రీ సర్వే గ్రామాలు తదితర 13 అంశాలపై జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. పెండింగులో ఉ న్న భూ సంబంధిత కోర్టు కేసులు, భూ సంబంధిత తగదాలు తదితర కేసులను త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 102 మంది గైర్హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 3,097 మందికి 2,995 మంది హాజరుకాగా.. 102 మంది గైర్హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 40 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం షిఫ్టులో 1,641 మందికి 1,573 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 1,456 మందికి 1,422 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
హెచ్‌ఎం సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీస్
జంగారెడ్డిగూడెం: లక్కవరం రెడ్డిపేట ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. పాఠశాలలో అన్యమత ప్రచారంపై తల్లితండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు బి.రాముడు, జి.రాములు సుబ్రహ్మణ్యానికి షోకాజు నోటీసు అందజేశారు.
డీసీసీబీ సీఈఓగా సింహాచలం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.సింహాచలం నియమితులయ్యారు. ఆయన గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ హోదాల్లో పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు. కాగా ప్రస్తుతం ఈ స్థానంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆప్కాబ్ అధికారి ఎంఎస్‌ఆర్‌కే తిలక్‌ను తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేశారు. సింహాచలం సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
జనన, మరణాల నమోదు తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment