పాపాలను హరించే పాతాళ భోగేశ్వరుడు
కై కలూరు: పాతాళానికి పంచ బుగ్గల కోనేరు కలిగిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి దివ్య కల్యాణ శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. 11వ శతాబ్దంలో వేంగిరాజు రాజరాజచోళుడి కాలంలో నిర్మించిన ఈ శివాలయానికి దక్షిణ కాశీగా పేరు. తెలుగులో ఆది కావ్యాఆనికి ఆంకురార్పణ జరిగిన పవిత్ర కోనేరు(పుష్కరిణీ)తో పాటు స్వామి పాదాల గుర్తులను ఇప్పటికీ భక్తులు తిలకిస్తున్నారు. ఏటా మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకూ పంచాహ్నిక కల్యాణ మహోత్సవాలు తిలకించడానికి కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో 3 మైళ్ళ దూరంలో స్వామి దర్శనానికి లక్షల్లో భక్తులు విచ్చేస్తారు.
భోగేశ్వరలంకలో రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా, నాగలి కర్ర తగిలి రక్తం పారుతూ స్వయంభూలింగం బయటపడింది. నాగలి కర్ర తగిలి విరిగిన భాగాన్ని అతికించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భాగం ఒక పక్క విరిగినట్లుగా, అతికించినట్లుగా, ఆ భాగం నుంచి రక్తపు నీరు చమరిస్తున్నట్లుగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ లింగాన్ని కలిదిండి తీసుకొచ్చేందుకు రైతు విఫలయత్నం చేశాడు. ఆ రాత్రి స్వామి భక్తుల కలలో కనిపించి కోడికూత, రోకటి పోటు వినలేనంటూ ఏకాంతంగా ఉన్న ఈ చోటనే ఆలయ నిర్మించాలని కోరాడని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది.
స్వామి పాదాల గుర్తులు
పూర్వం వర్షకాలంలో ఒక రోజున జోరున వర్షం కురుస్తుంటే స్వామి నిత్యార్చనకు ఆలస్యం జరిగిందట, దీంతో స్వామి వారు స్వయంగా ధ్వజస్తంభం ఎక్కి అర్చకుల రాకను గమనించి ధ్వజ స్తంభంపై నుంచి దూకడంతో కింద స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడ్డాయని, వీటిని ఇప్పటికీ ప్రత్యక్షంగానే చూస్తున్నామని భక్తులు చెబుతారు. ఈ దేవాలయంలో నందీశ్వరుడికి విశేషంగా భక్తులు పూజలు చేస్తారు.
పంచ బుగ్గల కోనేరు..
కోనేరు వద్ద భక్తితో ‘హరహరా’ అంటే ‘బుడబుడ’ మంటూ నీరు పైకిరావడం భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతుంది. పూర్వం ఆంధ్ర దేశాన్ని ఏలిన రాజరాజనరేంద్రుడు, కవి నన్నయలు తణుకులో నిర్వహించిన యజ్ఞం పూర్తి చేసుకుని ఆశ్వాలపై కలిదిండికి వచ్చారు. దారిలో ఓ నలుగురు అశ్వాల కంటే ముందు పరిగెత్తుతూ కోనేరులో దిగి మాయమయ్యారు. రాజు, నన్నయకు సరస్వతి దేవీ ప్రతక్ష్యమై మీకు ఎదురు పడింది ‘భోగేంద్రులు – నాగేంద్రులు’ అని చెప్పి ఇక్కడ కోనేరు ద్వారా పాతాళానికి వెళ్తారని తెలిపింది. ఒడ్డున నిలిచి పాతాళ భోగేశ్వరా హరహర అని పిలిస్తే బుడబుడ మంటూ బుడగలు వస్తాయని అమ్మ చెప్పిందని పురాణం. రాజరాజ నరేంద్రుడు ఆ నాలుగు పద్యాల కావ్యంలో శోభించేలా కవి నన్నయ్యభట్టుచే తొలి తెలుగు కావ్యం ఇక్కడే రాయించారంటారు.
కలిదిండిలో 24 నుంచి 28 వరకు కల్యాణ మహోత్సవాలు
11 శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన శివాలయం
తీర్థానికి అన్ని ఏర్పాట్లూ చేశాం
పాతాళ భోగేశ్వరుడి కల్యాణం తిలకిస్తే పాపాలు హరిస్తాయని నమ్మకం. ఈ నెల 25 అర్థరాత్రి 1.25 గంటలకు స్వామి కల్యాణం జరుగుతుంది. శివరాత్రి తీర్థానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పవిత్ర కోనేరులో నీటిని నింపాం. సమీప ప్రాంతాల నుంచి లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. – వీఎన్‌కే.శేఖర్,
ఈవో, పాతాళ భోగేశ్వరస్వామి దేవస్థానం
పాపాలను హరించే పాతాళ భోగేశ్వరుడు
పాపాలను హరించే పాతాళ భోగేశ్వరుడు
పాపాలను హరించే పాతాళ భోగేశ్వరుడు
Comments
Please login to add a commentAdd a comment