చోరీ చేసిన బైక్‌ల స్వాధీనం
ఏలూరు (టూటౌన్): బైక్‌ల దొంగతనం కేసును భీమడోలు పోలీసులు ఛేదించారు. డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్ర రావు భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో పొలం కౌలుకు చేస్తున్నాడు. పొలం షెడ్డులో ఉన్న అతని బైక్ చోరీకి గురైంది. దీనిపై భీమడోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ యుజె.విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్, సిబ్బంది ఈ కేసును దర్యాప్తు చేశారు. ఏలూరు వంగాయగూడెంకు చెందిన వాసే రాజు అలియాస్ సంసోను, భీమడోలుకు చెందిన యర్రంశెట్టి పవన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ముద్దాయిలు ఈ నెల 6న ఏలూరు గంగానమ్మ గుడి సమీపంలో వృద్ధురాలి మెడలోని బంగారు తాడును తెంపుకుపోయారు. వాసే రాజుపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వారి నుంచి మూడు బైక్‌లు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment