సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
భీమవరం: ఎన్టీపీసీ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంయపియన్‌షిప్ పోటీల్లో భీమవరం భారతీయ విద్యా భవన్స్ విద్యార్థిని ఎం.సూర్యహంసిని ప్రతిభ చూపిందని కోచ్ కమల్ కిషోర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో హంసిని ఢిల్లీకి చెందిన కుమిత్ సనానిపై గెలిచి బంగారు పతకం సాధించిందన్నారు. హంసినిని స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు అభినందించారు.
శ్రీవారి పథకాలకు రూ.7.21 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి పథకాలకు ఒక భక్తుడు ఆదివారం రాత్రి రూ.7.21 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన బొప్పరపు వెంకట లోహిత్ ముందుగా కుటుంబసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.5 లక్షలు, గోసంరక్షణ పథకానికి రూ.2,21,000 వెరసి రూ.7,21,000 జమచేశారు.
పెద్దింట్లమ్మా.. కోర్కెలు తీర్చమ్మా
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ భక్తుల కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మకు నైవేద్యాలు, పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, భక్తుల విరాళాలు, వాహన పూజలు ఇలా అన్ని కలిపి రూ.52,396 ఆదాయం వచ్చిందని తెలిపారు.
పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
కైకలూరు: గుర్తుతెలియని మృతదేహం శ్యామలాంబపురం శ్మశాన వాటిక సమీప పంట కాల్వలో ఆదివారం కొట్టుకువచ్చింది. వీఆర్వో బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫిర్యాదు మేరకు కై కలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కై కలూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మాట్లాడుతూ మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని చెప్పారు. వివరాలు తెలిస్తే 9440796434, 9440796433 నంబర్లకు తెలియజేయాలన్నారు.
సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
Comments
Please login to add a commentAdd a comment