విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవాటు చేయాలి
తణుకు అర్బన్: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని అలవాటుచేయాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఆదివారం తణుకు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చిన్ననాటి నుంచే మంచి నడవడిక, పెద్దలతో గౌరవంగా మెలగడం, పోటీతత్వాన్ని అనుకరించేలా చేస్తే భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్) నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందని, ఆ ఒత్తిడిని తట్టుకుని మన పిల్లలు నిలవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్స్‌తో గడుపుతున్నారని అది ఎంతో నష్టమన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే ప్రముఖ పాత్ర అని, తల్లిదండ్రులనురోల్ మోడల్‌గా తీసుకుని వారిని అనుకరిస్తారని చెప్పారు. సదస్సుల్లో అకడమిక్ డైరెక్టర్ సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తణుకు కాలేజ్ ప్రిన్సిపాల్ కె.దుర్గాప్రసాద్, తణుకు స్కూలు ఇన్‌చార్జ్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment