కలుపు మందు తాగి యువకుడి ఆత్మహత్య
భీమడోలు: ప్రేమించిన యువతి బంధువులు చంపేస్తామని బెదిరించడంతో భయంతో ఓ యువకుడు కలుపుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూళ్లకు చెందిన యువకుడు అడపా వీర రాఘవేంద్రకుమార్(19) గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణకాలనీకి చెందిన ఆడపా రాఘవేంద్రకుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 20న రాత్రి సమయంలో యువతి బంధువులు వచ్చి అమ్మాయికి పెళ్లి నిశ్చిమైందని.. ఆమె జోలికి రావద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. భయంతో అదే రోజు రాత్రి ఆ యువకుడు కలుపు మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాఘవేంద్రకుమార్ ఇచ్చిన మరణ వాంగ్మూలం మేరకు మృతికి కారణమైన సురేష్, సాయి, నాగులపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.
ప్రేమించిన యువతి బంధువుల బెదిరింపు
Comments
Please login to add a commentAdd a comment