పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి
కైకలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పిలిచే ఆటపాక పక్షుల విహార కేంద్రం పర్యాటకులతో ఆదివారం సందడిగా మారింది. శీతాకాలపు వలస పక్షుల కేరింతలను ఆస్వాదించడానికి ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు విచ్చేశారు. బోటు షికారులో పెలికాన్, పెయింటెడ్ స్టోక్ పక్షుల అందాలను వీక్షించారు. అనంతరం ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంను సందర్శించారు. దీని సమీపంలోని చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు వివిధ ఆటలు ఆడుకున్నారు.
కోడి పందేలపై దాడి
ఉండి: మండలంలోని కలిసిపూడిలో నిర్వహిస్తున్న కోడి పందేలపై ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1600 నగదు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment