రాజబాబు మరణం పార్టీకి తీరని లోటు
ద్వారకాతిరుమల: వైఎస్సార్‌సీపీ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు (రాజబాబు) లేని లోటు పార్టీకి తీరనిదని ఆ పార్టీ ముఖ్య నేతలు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశా రు. ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం మండలంలోని సీహెచ్ పోతేపల్లిలో స్వగృహానికి తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు చెందిన పలువురు నేతలు రాజబాబు పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత, మాజీ మంత్రి, పార్టీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి శ్రీనివాస్, పార్టీ కొవ్వూరు ఇన్‌చార్జి తలారి వెంకట్రావు, చింతలపూడి ఇన్‌చార్జి కంభంపాటి విజయరాజు తదితరులు రాజబాబు పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూ తిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సీపీ ఆవిర్భావం నుంచి రాజబాబు పార్టీకి అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. పార్టీ శ్రేణులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ, పార్టీ బలోపేతానికి రాజబాబు చేసిన కృషి మరువలేమన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాజమండ్రి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, జిల్లా బూత్ కమిటీల కన్వీనర్ గుర్రాల లక్ష్మణ్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, నరహరిశెట్టి రాజా తదితరులు ఉన్నారు.
రాజబాబుకు డీఎన్నార్ నివాళి
ఏలూరు (టూటౌన్): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు పార్థీవదేహాన్ని పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment