స్పందన
కళేబరాల తొలగింపు
అత్తిలి : ‘పంట కాల్వల్లో వైరస్ కోళ్లు’ శీర్షికన ‘సాక్షి’ లో ఆదివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అత్తిలి కాలువపై ఉన్న పాలూరు డ్యాం వద్ద, పాలూరు గ్రామంలో స్లూయిజ్ వద్ద పేరుకుపోయిన చనిపోయిన కోళ్ల, జంతు కళేబరాలను పొక్లయిన్‌తో తొలగించారు. ఈ కార్య క్రమాన్ని ఈఓపీఆర్డీ ఎం.శ్రీనివాస్, అత్తిలి, పాలూరు సెక్రటరీలు జి.భాస్కర్. యు. ప్రసాదరావు పర్యవేక్షించారు.
పరిశుభ్రతపై అవగాహన
ఏలూరు(మెట్రో): గ్రీన్, క్లీన్ ఎనర్జీ ద్వారా పరిశుభ్రమైన పర్యావరణం అనే నినాదంతో ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన నడక ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియం నుంచి ఫైర్‌స్టేషన్ మీదుగా జిల్లా ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. ఎల్పీజీ సేల్స్ జనరల్ మేనేజర్ ఐఓసీఎల్ (విశాఖ) రవికుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిఒక్కరికీ గ్యాస్‌ను అందుబాటులో ఉంచిందన్నారు. ఎల్‌పీజీ సేల్స్ మేనేజర్ ఎంవీ రామ్‌ప్రసాద్, సహాయ పౌర సరఫరాల అధికారి వై.ప్రతాప్‌రెడ్డి, గ్యాస్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
రాట్నాలమ్మా.. నమోనమః
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు సమీప కృష్ణా జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి లడ్డూ ప్రసాదంపై రూ.16,935, పూజా టికెట్లపై రూ.30,500, ఫొటోల అమ్మకం ద్వారా రూ.1,500, విరాళాల రూపంలో రూ.5,500 ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
స్పందన
స్పందన
Comments
Please login to add a commentAdd a comment