మూడు నెలలుగా జీతాల్లేవ్
ఆకివీడు: తమకు మూడు నెలలుగా జీతాలు లే వని పెదకాపవరం పంచాయతీ సిబ్బంది డీపీఓ అరుణశ్రీ వద్ద వాపోయారు. పెదకాపవరంలో పన్ను వసూళ్లపై డీపీఓ ఆదివారం సమీక్షించారు. గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో రూ.20 లక్షలకు పైగా పన్ను బకాయిలు ఉండటంపై సిబ్బందిని నిలదీశారు. వసూళ్లను వేగిరపర్చాలని సూచించారు. ఇటీవల సుమారు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు సర్పంచ్ ఊసల బేబీ స్నేతు డీపీఓకు వివరించారు. ముందుగా డీపీఓ గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఇతర ప్రాంతాల్లో పర్యటించగా తాగునీటి సమస్యను స్థాని కులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. 15 రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని డీపీఓ చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి సోమవారం నుంచి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. డీఎల్‌పీఓ బాలాజీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment