ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ఆమోదం పొందాలి. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎంసీఎంసీ కమిటీని నియమించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఈసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎంసీఎంసీ సెల్‌ను ఏలూరు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment