పెనుమంట్ర: వెలగలేరు శివాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పడాల సూర్యకుమారి వారం రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి వైజాగ్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానిక బంధువులు సమాచారాన్ని ఆమెకు తెలియజేయడంతో వైజాగ్ నుంచి వచ్చిన ఆమె పెనుమంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీలో ఇరవై మూడున్నర కాసుల బంగారం, రూ.1.80 లక్షల నగదును దొంగలు దోచుకుపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. పెనుమంట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment