
చేపలు, మటన్‌కు క్యూ
భీమవరం(ప్రకాశం చౌక్): బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూతపడగా.. మిగిలిన ప్రాంతాల్లో చికెన్ కొనేవారు లేక కొనుగోళ్లు పడిపోయాయి. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు, మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. మాంసాహారం తినేవారు చికెన్‌కు ప్రత్యామ్నాయంగా చేపలు, రొయ్యలు, మటన్ వినియోగంపై దృష్టిపెట్టారు. ఫంక్షన్లలో చికెన్‌కి బదులు చేపలు, మటన్, రొయ్య, పీతలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరిగేవి. రెస్టారెంట్లలో అధికంగా చికెన్ వాడేవారు. ఆదివారం చికెన్ వినియోగం మరింత ఎక్కువ. ప్రస్తుతం బర్డ్‌ప్లూ కారణంగా రోజుకు కనీసం 500 నుంచి 1000 కిలోలు కూడా అమ్మకాలు జరగడం లేదు. చికెన్ అందుబాటులో లేకపోవడంతో చేపలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో చేపల ధరలు భారీగా పెరిగాయి. ఆయా రకం బట్టి కిలో రూ.150 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు చేపలు కిలో రూ.120 నుంచి రూ.140 వరకు పలికేవి. సముద్ర ఉత్పత్తులైన చేపలు, పీతల ధరలు కూడా పెరుగుతున్నాయి. రొయ్యలు కిలో రూ.500 నుంచి రూ.600 వరకు పెంచి విక్రయిస్తున్నారు. రెండు నెలల ముందు రొయ్యలు కిలో రూ.400 లోపు ఉండేవి. పీతలు నెల ముందు వరకు కిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.1000 ధర పలుకుతున్నాయి.
మటన్ మరింత ప్రియం
చికెన్ అమ్మకాలు లేకపోవడంతో మటన్ ధరలు దారుణంగా పెంచారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌కు ముందువరకు కిలో మటన్ రూ.800 నుంచి రూ.900 వరకు విక్రయించేవారు. ఇప్పుడు ఏకంగా రూ.1000 నుంచి రూ.1100కి పెంచి అమ్మతున్నారు.
బర్డ్‌ఫ్లూతో తగ్గిన చికెన్ అమ్మకాలు
చేపలు కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు పెంపు
మటన్ కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు పెంపు
పశ్చిమ గోదావరి జిల్లాలో
రెండు ప్రస్తుత ధర
నెలల క్రితం (రూ.లలో)
ధర(రూ.లలో)
మటన్ 800 1,100
చేప 150 200
రొయ్య 150 – 190 220 – 260
చికెన్ (బాయిలర్) 240 180
చికెన్ (ఫారం కోడి) 180 50
ఏలూరు జిల్లాలో..
మటన్ రూ.800 మార్పు లేదు
చికెన్ రూ.240 రూ.150
మేకలకు, గొర్రెలకు డిమాండ్
చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో మటన్ అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో మేకలు, గొర్రెలకు డిమాండ్ పెరిగింది. మటన్ వ్యాపారులు, ఫంక్షన్ల కోసం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వెళ్లి మేకలు, గొర్రెలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్‌లో మేకలు, గొర్రెలకు మంచి డిమాండ్ ఉంది.
– ఎస్‌కే హుస్సేన్, మటన్ వ్యాపారి

చేపలు, మటన్‌కు క్యూ

చేపలు, మటన్‌కు క్యూ
Comments
Please login to add a commentAdd a comment