ఇరగవరం: పోక్సో కేసులో ముద్దాయికి 8 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం భీమవరం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఎసై జానా సతీష్ తెలిపిన వివరాలివి. గొల్లమాలపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన తోట నరేష్ (27) లైంగికంగా వేధించేవాడు. అడ్డుపడిన వారిని సైతం చంపుతానని బెదిరించడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2022 జనవరి 27వ ఎసై జానా సతీష్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో ముద్దాయి నరేష్‌కు భీమవరం పోక్సో కోర్టు జడ్జి బి లక్ష్మీనారాయణ ఎనిమిదేళ్ల జైలు, రూ.60 వేలు జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బ్రహ్మయ్య వాదనలు వినిపించగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరించారు.
చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష
నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన మల్లవల్లి ప్రవీణ్‌కుమార్ 2020 ఆగస్టు 2న జంగారెడ్డిగూడెంకు చెందిన ఎర్‌నెస్ట్ కుమార్‌కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ తీర్చమని అడుగగా ఎర్‌నెస్ట్ కుమార్ 2020 డిసెంబర్ 27న ప్రవీణ్‌కుమార్‌కు ఒకొక్కటి రూ.5లక్షలు చొప్పున రెండు చెక్కులను ఇచ్చారు. ఆ చెక్కులను నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా ఖాతాలో నగదు లేదని వెనక్కు తిరిగి వచ్చాయి. దీంతో ప్రవీణ్‌కుమార్ కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం ఎర్‌నెస్ట్ కుమార్‌కు న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment