
స్నేహితుల సహకారం మరువను
రక్తం అందక నిండు గర్భిణీ మరణం నన్ను కలచివేసింది. సమాజానికి మేలు చేయాలని అప్పుడే భావించాను. నాకు స్నేహితులందరూ అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి మేము ఉన్నాం.. అనే చిన్న భరోసా కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇప్పుడు ఇంత మంది తోడుగా రావడం సంతోషం. మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తాం. – అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్, ఆడిటర్, హైదరాబాద్
సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం
సేవే పరమార్థంగా అందరం పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యులందరూ సకాలంలో స్పందిస్తున్నారు. శనివారం భీమవరంలో మహిళకు రక్తం అవసరమయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి ఆమెకు రక్తదానం చేశాను. ఇలా అందరూ సభ్యులు చేస్తున్నారు. అపోహలు విడనాడి అందరూ రక్తదానానికి ముందుకు రావాలి.
– ఉండి రాజశేఖరరెడ్డి, సభ్యుడు, మూలలంక, కలిదిండి మండలం

స్నేహితుల సహకారం మరువను
Comments
Please login to add a commentAdd a comment