ఆకివీడు: విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపిన వివరాలివి. మంగళవారం స్థానిక గుంటూరు సెంటర్‌లోని ఖాళీ ప్రదేశంలో ఓ టెంట్ వద్ద సత్తినీనీనీడి ధనరాజు, మణికంఠ, తోట అయ్యప్ప గుమికూడి ఉన్నారు. దీనిపై 100కు వచ్చిన ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ శివ అక్కడికి వెళ్లి వారిని వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం శివ మరో కానిస్టేబుల్ కోటేశ్వరరావుతో సాయంత్రం డ్యూటీకి వెళుతుండగా అదే ప్రాంతంలోని బ్రాందీ షాపు వద్ద కాపు కాసి కానిస్టేబుల్ శివపై మణికంఠ, ధనరాజు, అయ్యప్ప దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకుని గొడవను నిలుపుదల చేశారు. కానిస్టేబుల్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment