పెద్దింట్లమ్మ జాతరను విజయవంతం చేద్దాం
కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీవో, జాతర నిర్వాహణ చైర్మన్ డాక్టర్ అచ్యుత అంబరీష్ చెప్పారు. మార్చి 1 నుంచి 13 వరకు జరిగే జాతర(తీర్థం) నిమిత్తం కొల్లేటికోట దేవస్థానం వద్ద రెండో విడత వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరూ పనిచేయాలన్నారు. జాతర అన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. ముందుగా జాతర గోడపత్రి, బుక్‌లెట్, కరపత్రాలను అవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దారు ఎండీ.ఇబ్రహీం, డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఆర్.రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment